india women vs nepal women's t20 match asia cup2024
Sports

ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఉమెన్స్ ఏషియా కప్: ఇండియా విమెన్ నేపాల్ విమెన్

T20 క్రికెట్ ఉమెన్స్ ఏషియా కప్ శ్రీలంక దేశంలోని దంబుల్లా నగరంలో ఉన్న రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు ఇండియా విమెన్ మరియు నేపాల్ విమెన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది . ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏ లో ఇండియా,పాకిస్థాన్ ,నేపాల్ మరియు యు ఏ ఈ జట్లు ,గ్రూప్ బి లో శ్రీలంక , థాయిలాండ్ ,బంగ్లాదేశ్ మరియు మలేషియా జట్లు పోటీపడుతున్నాయి.

T20 క్రికెట్ ఇండియా విమెన్ ఇన్నింగ్స్ వన్

 భారత్ మహిళల జట్టు మరియు నేపాల్ మహిళలు జట్టు మధ్య జరిగిన ఉమెన్స్ ఆసియా కప్ T20-2024 పదో మ్యాచ్లో మొదట టాస్ గెలిచి ఇండియా ఉమెన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్దిష్ట 20 వోవర్స్లో భారత మహిళా జట్టు 178-3  రన్స్ చేసింది భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ షఫీలి వర్మ 48 బంతుల్లో 81(4 x 12,6 x 1) పరుగులు చేశారు. హేమలత 42 బంతుల్లో 47 (4 x 5,6 x 1)పరుగులు  చేశారు.ఓపెనర్స్ ఇద్దరు ధాటిగా ఆడటంతో పవర్ ప్లే 6 ఓవర్స్ లో 50 పరుగులు చేశారు ,10 ఓవర్స్ కి 91 పరుగులు చేశారు . మొదటి వికెట్ 122 పరుగుల భాగస్వామ్యం చేశారు . వీరిద్దరి సహకారంతో భారత మహిళా జట్టు భారీ స్కోరు చేసింది చివర్లో జె రోడ్రిగస్  వేగవంతన్న 15 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు చేకూర్చారు.

T20 క్రికెట్ నేపాల్ విమెన్ ఇన్నింగ్స్ టూ

రెండో ఇన్నింగ్స్ లో నేపాల్ ఉమెన్స్ టీం 20 ఓవర్లలో 96 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓడిపోయారు . ఫెసర్ అరుంధతి రెడ్డి నేపాల్ జట్టు ఓపెనర్స్ ఇద్దరినీ తక్కువపరుగులకే అవుట్ చేయటంతో మిడిల్ ఆర్డర్ బట్టర్స్ ను దీప్తిశర్మ అద్భుతమైన స్పిన్ తో నాలుగు ఓవర్స్ లో  13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది రేణుక ఠాకూర్ సింగ్  ఒక వికెట్, అరుంధతి రెడ్డి  రెండు వికెట్లు ,రాధా యాదవ్ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో టాప్ స్కోర్ చేసిన  షఫీలి వర్మ ను ప్లేయర్  అఫ్ ది మ్యాచ్ గా  ప్రకటించారు.

పాయింట్స్ టేబల్

గ్రూపులో మూడు మ్యాచ్ లలో  మూడు  గెలిచి భరత్ మహిళా జట్టు మొదటి స్థానంలో ఉంది పాకిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ లకు  రెండు మ్యాచ్ లలో  గెలిచి రెండవ స్థానంలో ఉంది నేపాల్ మరియు యు ఏ ఈ టీంలు      డిస్కక్వాలిఫై అయ్యాయి. ఇండియా ఉమెన్ పాకిస్తాన్ ఉమెన్స్ లో గ్రూప్ ఏ లో నుంచి సెమీఫైనల్ కి అర్హత సాధించాయి. గ్రూప్ బి లో ఉన్న జట్ల ఫలితాలు తేలాల్సి ఉంది.సెమీస్ చేరిన ఇండియా మరియు పాకిస్థాన్ జట్లు గ్రూప్ బి లో మొదటి రెండవ స్థానం లో ఉన్న జట్ల తో సెమీ ఫైనల్ లో పోటీపడతారు .

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *